మిత్రుడి కుమార్తె వివాహానికి పూర్వవిద్యార్థుల చేయూత

by Sridhar Babu |
Valigonda
X

దిశ, భువనగిరి రూరల్ : వాళ్లంతా 40 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు. నాటి నుంచి నేటి వరకు స్నేహితుల కష్టసుఖాలను పంచుకుంటున్నారు. ఏ ఒక్కరికి ఆపద వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు. అందరికీ పెళ్లిలై ఎవరి బాధలు వాళ్లకు ఉన్నా.. నాటి స్నేహితులకు కష్టమోచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. తాజాగా ఓ మిత్రుడి కుమార్తె వివాహానికి పూర్వ విద్యార్థులు అంతా కలిసి చేయుతనిచ్చారు. తండ్రి లేకపోయినా ఆయన మిత్రులే ముందుండి పెళ్లి జరిపిస్తున్నారు.

వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన మహ్మద్ మూర్తుజ వలిగొండలో 1989-90లో పదో తరగతి చదవాడు. ఆయన గత కొంత కాలం క్రితం మరణించాడు. దాంతో ఆయన కుటుంబం పేదరికంతో బాధపడుతోంది. అది తెలుసుకున్న మూర్తుజ మిత్రులు ఆయన కుమార్తె సాజిద వివాహానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చారు. నాటి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి రూ.50 వేల మొత్తాన్ని సేకరించారు. ఆ నగదును ఆదివారం నాగారంలో సాజిదకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కుముద తాయారు, చింతల కవిత, బత్తిని శెట్టయ్య గౌడ్, జిల్లా చందు, పోకల రమేశ్, పబ్బు వెంకటేశ్, జూకంటి కనకయ్య, గంగాపురం శ్రీనివాస్, శ్రీపాద రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed