- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ఈ నెల పాత జీతాలే
దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగులు అనుకున్నట్టే జరుగుతోంది. అదేదో సినిమాను ట్రోల్ చేసినట్టు… “ మాకు నమ్మకం లేదు దొరా.. జీవో విడుదలైనా నమ్మం.. అకౌంట్లో జమ అవ్వాలి. ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవాలి… అప్పుడే నమ్మేది” అన్నట్టుగా పెరిగిన వేతనాలు ఈ నెలలో కూడా అందడం లేదు. ఆయా ప్రభుత్వ శాఖలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి. పాత స్కేల్ ప్రకారమే పే బిల్స్ పంపించాలంటూ అకౌంట్స్ సెక్షన్లకు ఆదేశాలిచ్చాయి. ప్రస్తుతం జీవోలు జారీ అయినా… ఆఖరి జీవో శనివారమే వచ్చింది. దీంతో వేతన సవరణ ప్రకారం కొత్త వేతనాలు చేయడం లేదు. ఎందుకంటే దీనిపై ఆయా శాఖల్లో దాదాపు వారం, పది రోజుల పని మిగిలి ఉంది. దీంతో జూలై నెలలో కూడా పాత వేతనాలే అందుకోనున్నారు. అయితే కొత్త వేతనాలను సప్లిమెంటరీ పే బిల్గా వచ్చేనెల 15 వరకు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుతున్నారు. జూలై 5 తర్వాత సప్లిమెంటరీ బిల్స్ రెడీ చేసి పే అండ్ అకౌంట్స్, ట్రెజరీలకు పంపిస్తే 15వ తేదీ వరకు సప్లిమెంటరీ సాలరీ బిల్గా పెరిగిన వేతనం వచ్చే అవకాశం ఉందంటున్నారు.
సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేదు
వేతన సవరణ ఫిట్మెంట్ ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ఆయా శాఖల వారీగా సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ చేయలేదు. అంతకు ముందు దీనిపై ప్రతి ఉద్యోగి నుంచి వారి అప్షన్ పత్రాలను తీసుకోవాల్సి ఉంటోంది. వేతన సవరణ ఫిట్మెంట్, పదోన్నతుల వంటి అన్నింటిపైనా ఆప్షన్ తీసుకున్న తర్వాత 1–7–2018 ప్రకారం వారి స్కేల్, బేసిక్‌ను కొత్త పీఆర్సీ 2020కి పెంచాల్సి ఉంటోంది. సాలరీ స్కేల్‌ను కొత్త పీఆర్సీ ప్రకారం ఖరారు చేసిన తర్వాత మళ్లీ పదోన్నతులపై క్లారిటీ తీసుకోవాల్సి ఉంటోంది. ఒకవేళ పదోన్నతులు వస్తే స్కేల్ మారుతోంది. ఇదంతా దాదాపు వారం నుంచి 10 రోజుల ప్రాసెస్ ఉంటోంది. ఆ తర్వాత ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను సూచిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉంటోంది. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రొసీడింగ్స్‌పై ఆయా శాఖల ఉన్నతాధికారులు సంతకం చేసి, ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత కొత్త సాఫ్ట్వేర్ సిద్ధం చేసి ఉద్యోగుల బేసిక్, గ్రేడ్, ప్రమోషన్ల వివరాలన్నీ సర్వీసు రిజిస్ట్రర్ అధారంగా నమోదు చేయనున్నారు. అనంతరం కొత్త సాఫ్ట్‌వేర్‌లో పెరిగిన ఫిట్మెంట్ అప్డేట్ కానుంది.
వాస్తవంగా రాష్ట్రంలోని హెచ్ఓడీ శాఖలు ఈ నెల 21లోగా పే అండ్ అకౌంట్స్‌కు, జిల్లాల్లోని ప్రభుత్వ శాఖలు ట్రెజరీకి ఈ నెల 25లోగా బిల్లులు సబ్మిట్ చేయాల్సి ఉంటోంది. ప్రస్తుతం ఫైనల్ జీవో శనివారం విడుదల కావడంతో వేతన సవరణ అంశాలను ముట్టకోలేదు. సోమవారం నుంచి ఆయా శాఖలు ఈ ప్రాసెస్ మొదలు పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ నెల పాత బేసిక్తోనే వేతన బిల్లులు సబ్మిట్ చేయాలంటూ సూచించారు. దీంతో జూలైలో పాత వేతనాలనే అందుకోనున్నారు.
రెండు నెలల ఏరియర్స్‌పై క్లారిటీ లేదు
మరోవైపు ఏప్రిల్, మే ఏరియర్స్‌పై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. జీవోలో మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఇస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో జూలై, ఆగస్టు నెలలో కూడా రెండు నెలల ఏరియర్స్ రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏరియర్స్‌ను ఎప్పుడు ఇస్తారో ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది మార్చి వరకు ఏరియర్స్‌ను ఇచ్చే వెసలుబాటు ఉంది.
సప్లిమెంటరీ పే బిల్స్‌కు ఛాన్స్..?
అయితే పెరిగిన వేతనాన్ని జూన్ ఏరియర్స్ సప్లిమెంటరీ పే బిల్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం వేతన సవరణ ప్రాసెస్‌ను వచ్చేనెల 5వ తేదీ వరకు పూర్తి చేస్తే.. ఆ తర్వాత వాటిని పే అండ్ అకౌంట్స్‌కు, ట్రెజరీలకు సమర్పించే అవకాశం ఉండనుంది. జూలై 5 వరకు సబ్మిట్ చేస్తే అదేనెల 15 వరకు సప్లిమెంటరీ సాలరీగా పెరిగిన వేతనం అందుకోనున్నారు. అయితే దీనిపై ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటోంది.
బంపర్ ఆఫర్.. 2 గంటల పనికి రూ. 25 వేలు..!
- Tags
- Old salaries