- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసరా రాక.. మందులు లేక.. ఎలా బతికేది..?
దిశ, కుబీర్ : ఆసరా పెన్షన్ చెల్లింపులో జాప్యం కావడం వల్ల వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆసరా పెన్షన్ ద్వారా వచ్చిన డబ్బుతో మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు టాబ్లెట్లు కొనుగోలు చేసేవారు. ప్రతినెలా ప్రభుత్వం మొదటి వారంలోనే పంపిణీ చేసేది. మూడు వారాలు గడుస్తున్నా ఇంతవరకు పెన్షన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఎలాంటి ఆధారం లేక నిరుపేద వృద్ధులు ఆసరా డబ్బులతోనే నెలకు సరిపడా నిత్యావసర సరుకులు తెచ్చుకుంటారు. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల వైరల్ జ్వరాల బారిన పడి, చేతిలో చిల్లి గవ్వలేక మందులు తెచ్చుకోలేక ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు కంపెనీలు సక్రమంగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రతినెలా అందించే ఆసరా పెన్షన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ అందించాలని వారు కోరుతున్నారు.