పాపం.. ఇళ్లు కూలి వృద్ధుడు మృతి

by Aamani |
పాపం.. ఇళ్లు కూలి వృద్ధుడు మృతి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పాతఇండ్లు కూలిపోతున్నాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంట్లో నిద్రించినవారు నిద్రలోనే కన్నుమూస్తున్నారు. దీంతో తాజాగో మరో వృద్ధుడు ఇళ్లు కూలి మృతిచెందాడు.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామంలోని ఓ ఇళ్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న దుర్గం పోశయ్య(70) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

Advertisement

Next Story