మునుగోడులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

by Sumithra |
మునుగోడులో వృద్ధ దంపతుల ఆత్మహత్య
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సిరికొండ సైదులు(65), జానకమ్మ(60) భార్యాభర్తలు ఇద్దరు మునుగోడులో నివాసం ఉంటున్నారు. సైదులు భార్య జానకమ్మ గత 5 సంవత్సరాలుగా చర్మ వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని ఆసుపత్రులకు తిప్పిన నయంకాక పోవడంతో మనస్థాపానికి గురైన దంపతులు ఇద్దరు శుక్రవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన దంపతులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. మునుగోడు ఎస్సై రజినీకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story