- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OLA : ఈ-స్కూటర్ల కోసం బ్యాంకులతో ఓలా ఒప్పందం.. ఎందుకంటే ?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ దిగ్గజం ఓలా సంస్థ త్వరలో తన ఈ-స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారులకు రుణ సౌకర్యాలు అందించనుంది. దీనికోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకుతో పాటు టాటా కేపిటల్ సహా ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఓలా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గత నెలలో ఓలా తన ఎస్ 1, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ. 99,999 నుంచి రూ. 1,29,999 మధ్య ఉంటుందని పేర్కొంది.
ఈ నెల 8వతేదీ నుంచి ఎస్1 స్కూటర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని, అక్టోబర్ నెల నుంచి బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీలను అందించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు రుణ సౌకర్యాల కోసం దేశీయ దిగ్గజ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వీటిలో కొన్ని 8 నుంచే రుణాలను ఇవ్వనున్నాయి. అనంతరం మిగిలిన సంస్థలు అందుబాటులోకి వస్తాయని ఓలా మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబె అన్నారు. కొనుగోలుదారులు సరసమైన రుణ సౌకర్యంతోనే వాహనాన్ని సొంతం చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. నెలవారీ రుణ వాయిదా కనిష్ఠంగా రూ. 2,999 నుంచి ఉంటుందని వరుణ్ వెల్లడించారు.