వచ్చే ఏడాది ఈ-మోటార్‌ సైకిళ్ల తయారీ: ఓలా ఎలక్ట్రిక్!

by Harish |
Ola electric e-scooter
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనంగా ప్రవేశించిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో కొత్త ప్రకటన చేసింది. వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో పాటు తక్కువ ధరకే ఈ-స్కూటర్లను తీసుకురానున్నట్టు తెలిపింది. ఓలా తన ఈవీ విభాగంలో కేవలం ఈ-స్కూటర్లకే పరిమితం కాకుండా ఈ-మోటార్‌ సైకిళ్లు, చవకైన ఈ-స్కూటర్లు, ఈ-కార్ల తయారీకి కూడా విస్తరించాలని భావిస్తున్నట్టు సంస్థ సీఈఓ భవేష్ అగర్వాల్ స్పష్టం చేశారు.

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, చవకైన ఈ-స్కూటర్లకు సంబంధించిన ఒక వ్యాసాన్ని ట్విటర్ ద్వారా ఉటంకిస్తూ ‘వచ్చే ఏడాది ఈ-మోటార్‌ సైకిళ్లపై దృష్టి సారించనున్నామని’ చెప్పారు. ఇటీవలే ఓలా సంస్థ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, కార్ల అభివృద్ధి ప్రణాళికను వేగవంతం చేసేందుకు 200 మిలియన్ డాలర్లు(రూ. 1490 కోట్ల) నిధులను సేకరించింది. ‘మిషన్ ఎలక్ట్రిక్’ 2025 తర్వాత భారత్‌లో పెట్రోల్ టూ-వీలర్లు ఉండకూడదనే లక్ష్యంలో భాగంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ దశాబ్దం మధ్య నాటికి దేశీయ రోడ్లపై పెట్రోల్ టూ-వీలర్లు ఏవీ ఉండవని ఓలా అంచనా వేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed