అన్ని అర్హతలు ఉన్నా ‘ఆసరా’ లేదు.. కబీర్ కన్నీటి వ్యథ

by Anukaran |
kabir1
X

దిశ, నల్లబెల్లి: ఆరు పదుల వయస్సు దాటిన వారికి ప్రభుత్వం ఆసరా పింఛన్ ఇచ్చి అండగా ఉంటోంది. కానీ అన్ని అర్హతలను ఉన్న కబీర్ కు మాత్రం ఆసరా అండ లేకుండా చేస్తున్నారు కొందరు అధికారులు. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టకున్నా పట్టించుకోవడం లేదంటూ.. 67 ఏళ్ల కబీర్ కన్నీటి పర్యంతమయ్యారు. నల్లబెల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ కబీర్ వయస్సు 67 సంవత్సరాలు.

అన్ని అర్హతలతో ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛను కోసం అధికారులకు విన్నవించుకుంటూ.. కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా కరుణించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు వారి కూలీకి పోయి జీవనం గడుపుదాం అంటే కళ్ళు సరిగ్గా కనపడకుండా ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానని, ఇప్పటికైనా నా మీద దయతలిచి అధికారులు నాకు పింఛన్ వచ్చేలా చూడాలని అని వేడుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed