- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కడ అలా చాలామందే ఉన్నారు.. అయినా అదే నిర్లక్ష్య ధోరణే..!
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ నిబంధనలకు కేంద్రం ప్రభుత్వం ఇటీవల కొన్ని సడలింపులిచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ప్రస్తుతం స్వస్థలాలకు బయలుదేరారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలు వెళ్లేందుకు అనుమతులు సైతం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసమని వలస వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ప్రధానంగా మహారాష్ట్ర, ముంబై, గుజరాత్, సూరత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను తీసుకొచ్చేందుకు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధి చూపడం లేదు. దీంతో చాలామంది వలస కూలీలు తమకు అందుబాటులో ఉన్నవాహనాల్లోనో.. లేక కాలినడకనో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే వీరందరికీ ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించి స్వస్థలాల్లోకి ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎవరికి అందుబాటులో ఉన్న రూటులో వారు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తరలొస్తున్న వసల కార్మికులపై దిశ ప్రత్యేక కథనం.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి అధికం..
తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇందులో ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఎక్కువగా వలస వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులివ్వడంతో వలస వెళ్లిన వారంతా గ్రామాల్లోకి వస్తున్నారు. అయితే వీరిని అనుమతించేందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వలస కార్మికులకు ముందుగా వైద్య పరీక్షలు చేసి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షించాలి. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సి ఉండగా, లక్షణాలు లేనివారిని హోం క్వారంటైన్‌లో ఉండేలా చేయాలి. కానీ ప్రభుత్వం వైద్య పరీక్షలు చేయడమే భారంగా భావిస్తోన్నది. కరోనా కేసులు ఎక్కువైతే.. రాష్ట్రం పరువు ఎక్కడ పోతుందోననే ఆలోచనలో ఉన్నట్టు కన్పిస్తోన్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పద్మశాలీలు, గౌడ్స్, ఇతర కులస్తులు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు అధికంగా వలస వెళ్లారు. దేశంలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్ లు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల నుంచి వలస కార్మికులు గత నాలుగైదు రోజులుగా తరలివస్తున్నారు. చాలామంది ఇప్పటికే ఆయా గ్రామాలకు సైతం చేరుకున్నారు. వారిలో కొంతమంది ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతమంది కాలినడకన రావడం.. మరికొంతమంది మూడు నాలుగు రోజులకు పైగా ప్రయాణం చేసి అలసిపోవడం వల్లనో ఏమో గానీ అనారోగ్యంతోనైతే బాధపడుతున్నారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. ప్రభుత్వం గానీ అధికారులు గానీ అటువైపు చూడట్లేదు.
జనగాం ఘటనతోనూ తేరుకోని యంత్రాంగం
స్వస్థలాలకు తరలివస్తున్న వలస కార్మికుల్లో తమకు తెలియకుండానే కరోనాతో బాధపడుతున్న వారు లేకపోలేదు. అయితే అలాంటివారు స్వస్థలాలకు చేరుకున్న సమయంలో కరోనా వైరస్ మిగతా వారికి సోకే ప్రమాదం ఉంది. మూడు రోజుల క్రితం ముంబై నుంచి యాదాద్రి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలం జనగాం, కంకణాలగూడెనికి చెందిన పలువురు వలస కార్మికులు ముంబై నుంచి వచ్చారు. వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ ముగ్గురు కరోనా బాధితులు హైదరాబాద్ నగరంలోనే పట్టుబడడంతో సరిపోయింది. లేకపోతే వారు స్వగ్రామానికి చేరుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇదిలావుంటే.. వీరితో పాటే వచ్చిన మరికొంత మంది అప్పటికే కంకణాలగూడెనికి చేరుకున్నారు. ఆలస్యంగా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై వారిని గుర్తించి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
సూర్యాపేట, నల్లగొండలోనూ అదే పరిస్థితి..
సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోనూ వలస కార్మికుల పట్ల అదే నిర్లక్ష్య ధోరణి కన్పిస్తోన్నది. పాలదందా, కల్లుగీత పనిచేసే వారు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. వారంతా క్రమంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే వలస వెళ్లిన వారు వచ్చారనే విషయం ఇరుగు పొరుగు చెబితే తప్ప అధికారులకు తెలియడం లేదు. కొంతమంది ఇళ్లకు చేరుకున్నా.. బయట తిరగకుండా ఇంట్లోనే ఉంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నా.. స్థానికంగానే గోలి మందు మింగుతున్నారు. వాస్తవానికి అది కరోనా కాకపోయి ఉండొచ్చు. కానీ, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంది. కానీ, ప్రతి దానికి ఉన్నతాధికారులు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏంలపైనే భారం వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే నిర్లక్ష్యం పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు 10 రోజుల క్రితం గుజరాత్ నుంచి వచ్చాడు. అప్పటికి ఇంకా లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వనేలేదు. గ్రామానికి రాగానే ఒక్క రోజు మాత్రమే ఇంటికి పరిమితం అయ్యాడు. తర్వాతి రోజు నుంచి అందరితోనూ కలివిడిగా తిరిగాడు. అయితే అతడికి ఐదు రోజుల క్రితం జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కన్పించాయి. దీంతో ఆ గ్రామంలో అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది. సదరు యువకుడు స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించి మెడిసన్ వాడడంతో రెండు రోజుల్లో తగ్గిపోయింది. అది కరోనా వైరస్ ప్రభావం కాదని, మాములు లక్షణాలేనని తేలడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అలాంటి వారెవ్వరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అలాంటి వారిపై దృష్టి పెట్టాల్సి ఉంది.