వివాదస్పద భూమిని పరిశీలించిన అధికారులు

by Shyam |
వివాదస్పద భూమిని పరిశీలించిన అధికారులు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: వనస్థలిపురంలో భూ వివాదంలో కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారంలోని సర్వే నెంబరు 73నుంచి 101 వరకు ఉన్న భూమిని బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. మొత్తం 412ఎకరాల్లో 147ఎకరాలు సానా సతీష్, ఆయన బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వివాదస్పదమైన ఈ భూమిపై కమలప్రియా ఆటో జనరల్ ఏజెన్సీ పేరుతో కలకత్తాకు చెందిన ఫైనాన్స్ కంపెనీ నుంచి భారీస్థాయిలో రుణం పొందినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ భూమిలో సదరు కంపెనీ హైపోతికేషన్ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. అయితే, ఈ భూమికి సంబంధించిన వారసులు సానా సతీష్ వద్ద ఉన్న డాక్యుమెంట్లు నకిలీవని పిటీషన్ వేయగా, హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే, తాజాగా ఈ భూ వివాదంలో వనస్థలిపురం ఏసీపీ జయరామ్ సస్పెండ్ కాగా, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ హత్య కూడా ఈ వివాదంలో భాగంగానే జరిగినట్టుగా తెలుస్తోంది.

Advertisement

Next Story