- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
GHMC అధికారికి తుపాకీ గురి.. తప్పు ఎవరిదీ?
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలోని ఇద్దరు పెద్ద ఆఫీసర్ల మధ్య స్వల్ప వివాదాలు చినికి చినికి గాలివానగా మారాయి. డిప్యూటేషన్ మీదొచ్చిన అధికారి వ్యవస్థను నాశనం చేసేలా కంకణం కట్టుకున్నారా అనే స్థాయిలో అక్కడ పనితీరు కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు అంటూ ‘మీసేవా’ కేంద్రాల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే బల్దియా పరిధిలో 80 వేల దరఖాస్తులు ఆన్‌లైన్ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. మరో 8,500 దరఖాస్తులు సమాచారం లేని కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలో పెండింగ్‌లో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు ఉన్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో ఇన్ని ఇబ్బందులున్నా సదరు అధికారి తన పంతం నెగ్గించుకునేందుకు బల్దియా పరువునే ఫణంగా పెట్టారంటూ సీనియర్ ఆఫీసర్లు చెవులు కొరుక్కుంటున్నారు. వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేయలేక క్షేత్రస్థాయిలో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. జీహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సేవలను సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో కాకుండా మీసేవకు అప్పగించాలని నిర్ణయించినప్పటికీ అందుకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. 2019 డిసెంబర్ నుంచి హెల్త్ అసిస్టెంట్లను కాదంటూ ఏఎంసీలకు కేటాయించినప్పటి నుంచే ఈ సమస్యలు వస్తున్నట్టు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
ఏఎంఓహెచ్‌కు తపాకీతో బెదిరింపులు..
రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు అసహనానికి గురవుతున్నారు. సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఆలస్యమవుతుండటంతో సిటీజన్స్ సిబ్బందితో వాదనలకు దిగుతున్నారు. మరి కొంద రు బ్రోకర్లను ఆశ్రయించి అడిగినంత చెల్లించుకుంటున్నారు. డెత్ సర్టిఫికెట్ లో ఆలస్యం కావడంతో ఇన్సూరెన్స్ తో పాటు ఇతర పనులు కావడం లేదం టూ ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో అధికారులకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్ కోసం చార్మినార్ జోన్ పరిధిలోని ఓ సర్కిల్ ఏఎంఓ హె చ్‌ను ఒకరు పిస్టోల్‌తో బెదిరించడం సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత ఆ విభాగంలోని అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించేందకు హడలిపోతున్నారు. తాము ఈ పనులు చేయలేమంటూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మొరపెట్టుకున్నారు.
అధికారి నిర్వాకం.. వ్యవస్థకు శాపం
డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారి బల్దియా కేంద్ర కార్యాలయం నుంచి ఈ వ్యవస్థను ఆపరేట్ చేస్తు న్నారు. తనకు సంబంధం లేకపోయినా ఈ విభా గంలో మితిమీరిన జోక్యంతో బర్త్, డెత్ విభాగాన్ని నేలమట్టం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య శాఖ నుంచి బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన అధికారికి సైతం జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వ కుండా సతాయిస్తున్నట్టు సమాచారం. బాధ్యతలు అప్పగిస్తే తన జోక్యం తగ్గిపోతోందనే ఇవ్వడం లేదంటూ విభాగం అధికారులు చెప్పుకుంటున్నారు. విభాగంలో అవినీతిని తగ్గించేందుకు ప్రైవేట్ పరం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీలోని అన్ని కీలక విభాగాల్లో అవినీతి బహిరంగ రహస్యమే.. అలా అన్ని శాఖలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారా అని కింది స్థాయి సిబ్బం ది వాపోతున్నారు. తమ విభాగంలో అవినీతిపరులు ఉన్న మాట వాస్తవేమే కానీ ఒకరిద్దరు ఉన్నారని, మొత్తం వ్యవస్థను నాశనం చేస్తే తాము ఎలా బతకాలని సిటీజన్ సర్వీస్ సెంటర్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన ఉన్నతాధికారుల అవినీతిని ఏమీ చేయలేక తమలాంటి చిరు ఉద్యోగులపై ప్రతాపం చూపుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా కమిషనర్ జోక్యం చేసుకుని అవినీతిని నిరోధించి, పాత పద్ధతి లోనే సర్టిఫికెట్లను జారీ చేయాలని వారు కోరుతున్నారు.