- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిశా సీఎంకు బెదిరింపు లేఖ
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ప్రాణహాని ఉందని, ఏ క్షణంలోనైనా ఆయన హతమవ్వవచ్చునని హెచ్చరిస్తూ ఓ లేఖ వచ్చింది. పట్నాయక్‌ను హతమార్చడానికి కొందరు ప్రొఫెషనల్ కిల్లర్లు కాంట్రాక్టు పొందారని ఆ అనామక లేఖ పేర్కొంది. దీంతో సీఎం పట్నాయక్ సెక్యూరిటీ సమీక్షించి పెంచాలని హోం శాఖ స్పెషల్ సెక్రెటరీ సంతోష్ బాలా సూచించారు. లేఖపై దర్యాప్తునకు ఆదేశించారు. ‘కొంతమంది కాంట్రాక్టు కిల్లర్లు మిమ్మల్ని చంపడానికి డీల్ కుదుర్చుకున్నారు.
వారంత ప్రొఫెషనల్ కిల్లర్లు. ఏకే-47, సెమీ-ఆటోమేటిక్ పిస్టళ్లు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆయుధాలు రాష్ట్రంలోకి చేరాయి. మీరు ఏ క్షణంలోనైనా హతమవ్వవచ్చు. కాబట్టి జాగ్రత్త ఉండండి’ అని ఆంగ్ల భాషలో రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి నాగ్‌పూర్‌లో నివసిస్తుంటారని ఆ లేఖ తెలిపింది. వెంటనే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ, భువనేశ్వర్ సీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌లకు సంతోష్ బాలా ఆదేశించారు.