- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. సాలూరు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలు ఉన్నాయి. వాటిని ఆక్రమించేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. కొటియా గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం అభ్యంతరకరంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా విద్యార్థులకు కిట్ ఇచ్చేందుకు వెళ్తున్న తనను, ఉపాధ్యాయ సిబ్బందిని ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఒడిశా ప్రభుత్వం వ్యవహారశైలిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఒడిశా ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకు సంబంధించి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రాజన్నదొర తెలిపారు. కొండంగి, సారిక, ధనసరాయి, సంపంగిపాడు, కురుకుట్టి సర్పంచ్‌లకు డబ్బు ఆశ చూపి ఒడిశాకు చెందిన రాజకీయ నేతలు..అధికారులు తమవైపునకు తిప్పుకున్నారని ఆరోపించారు. గిరిజనుల భద్రత కోసమే తాము సంయమనం పాటిస్తున్నామని లేదంటే తాము కూడా ఒడిశాలా చేయగలమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని రాజన్నదొర తెలిపారు. తమ గ్రామాల్లో రోడ్లు కావాలని గిరిజనులు కోరుతున్నారని అందుకు తగిన చర్యలు తీసుకుందామంటే అటవీశాఖ సహకరించడం లేదని రాజన్నదొర తెలిపారు.