పుంజుకున్న సోనాలిక ట్రాక్టర్ల అమ్మకాలు..

by Harish |
tractor
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో సోనాలికా ట్రాక్టర్స్ మెరుగైన అమ్మకాలను సాధించినట్టు బుధవారం ప్రకటించింది. రైతులకు అవసరమైన వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చేందుకు, పండుగ సీజన్ కోసం, భారత్‌లోనే ఉత్తమ ఎగుమతి బ్రాండ్‌గా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న సోనాలిక ట్రాక్టర్స్ తన కొత్త కస్టమైజ్‌డ్ ట్రాక్టర్ పోర్ట్‌ఫోలియో ద్వారా అధిక అమ్మకాలను సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో సోనాలిక ట్రాక్టర్స్ విక్రయించిన 79,829 యూనిట్లతో పోలిస్తే ఈసారి 6.56 శాతం పెరిగి 85,068 ట్రాక్టర్లను విక్రయించినట్టు తెలిపింది.

వ్యవసాయ రంగంలో కొత్త యంత్రాల వినియోగం దిశగా రైతులు ఆసక్తి చూపిస్తుండటంతో అక్టోబర్‌లో సోనాలిక మొత్తం 17,130 ట్రాక్టర్లను విక్రయించి 5.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ‘ సోనాలిక హెవీడ్యూటీ ట్రాక్టర్ల పట్ల రైతులకు విశ్వాసం పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు అక్టోబర్ నెల అమ్మకాలను పరిశీలిస్తే మెరుగైన అమ్మకాలను నిర్వహించాం. రైతులకు అనుగుణంగా ట్రాక్టర్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆదరణను కలిగి ఉన్నాం. తమ ట్రాక్టర్ల తయారీలో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం. ఈ కారణంతోనే రైతుల నుంచి సోనాలిక ఆదరణను కొనసాగిస్తోందని’ సోనాలిక ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ అన్నారు.

Advertisement

Next Story