క్షుద్రపూజల కలకలం.. కెనాల్లో చిన్నారి డ్రెస్, ప్రాణంతో ఉన్న కోడి

by Sridhar Babu |
క్షుద్రపూజల కలకలం.. కెనాల్లో చిన్నారి డ్రెస్, ప్రాణంతో ఉన్న కోడి
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో క్షుద్ర పూజలు భయపెడుతున్నాయి. ఆది, గురువారాల్లో రాత్రి 12 గంటల సమయంలో క్షుద్ర పూజలు చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి సుల్తానాబాద్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో క్షుద్రపూజల కలకలం రేపాయి. ప్రాణంతో ఉన్న కోడిని కెనాల్ లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టారు. పక్కనే చిన్న పాపకు సంబంధించిన దుస్తులు ఉంచడంతో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

నాగరికత పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి వింత చేష్టలకు పాల్పడటం విస్మయానికి గురిచేస్తుంది. పోలీసు శాఖ, జన విజ్ఞాన వేదిక గాని అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సంఘటన స్థలానికి ఎస్ఐ ఉపేందర్ రావు చేరుకుని పరిశీలించారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇలాంటివి నమ్మవద్దని, కేవలం దిష్టి తీసుకోవడానికి ఇలా చేసి ఉంటారని అన్నారు. ఎవరైనా క్షుద్ర పూజల పేరుతో, ఇలాంటివి చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story