ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన కివీస్

by Shyam |
new zealand cricket team
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ జట్టు ఇంగ్లాండ్‌లో చరిత్ర సృష్టించింది. 1999 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వారినే ఓడించి 1-0తో టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు 2014 తర్వాత సొంత గడ్డపై టెస్టు సిరీస్ ఓడిపోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో కివీస్ జట్టు 8 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంతో రెండో టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. కివీస్ జట్టు ముందు కేవలం 38 పరుగుల టార్గెట్ మాత్రమే ఉండటంతో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేంది.

రోరీ బర్న్స్ (81), డాన్ లారెన్స్ (81) వీరోచిత పోరాటంతో పాటు మార్క్ వుడ్ (41) విలువైన పరుగులు జతకలవడంతో ఇంగ్లాండ్ జట్టు 303 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టులో డేవన్ కాన్వే మరోసారి ఆకట్టుకున్నాడు. కాన్వే (80), విల్ యంగ్ (82) లకు తోడు సీనియర్ బ్యాట్స్‌మాన్ రాస్ టేలర్ (80) రాణించడంతో 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ పేసర్ స్టువర్డ్ బ్రాడ్ మరోసారి చెలరేగిపోయాడు. 48 పరుగులకు 4 వికెట్లు తీయడంతో పాటు మార్క్ వుడ్, స్టోన్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో న్యూజీలాండ్ జట్టు 388 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నీల్ వాడ్నర్ 3, మాట్ హెన్రీ 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును కుప్పకూల్చారు. దీంతో కివీస్ గెలుపునకు కేవలం 38 పరుగులు అవసరం అయ్యాయి. కాగా, డెవాన్ కాన్వే (3), విల్ యంగ్ (8) త్వరగానే వికెట్లు పారేసుకున్నారు. అయితే విలియమ్‌సన్ గాయం కారణంగా తాత్కాలిక కెప్టెన్‌గా బాద్యతలు నిర్వర్తిస్తున్న టామ్ లాథమ్ (23) రాణించడంతో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 1999 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై కివీస్ జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మాట్ హెన్రీకి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్, డెవాన్ కాన్వేకు మ్యాన్ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు ఇంగ్లాండ్‌పై సిరీస్ నెగ్గి న్యూజీలాండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకున్నది.

Advertisement

Next Story

Most Viewed