- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మహిళా మంత్రులకు ఉద్వాసన.. త్వరలో కవితకు పట్టం'
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో త్వరలో కీలక పరిణామం చోటుచేసుకునుందా?.. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందా?.. కేసీఆర్ మంత్రివర్గంలోని ఇద్దరు మహిళలకు త్వరలో ఉద్వాసన జరగనుందా? వారి స్థానంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మంత్రి కాబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కవితకు మంత్రివర్గంలో చోటు కల్పించడం కోసం ఇప్పటికే మంత్రులుగా ఉన్న సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి వారి పదవులను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. గత టర్ములో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డికి ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకుండా అన్యాయం చేశారని, ఇకపైన కూడా ఆ అన్యాయం కొనసాగనుందని ప్రభాకర్ జోస్యం చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని లేపింది. ఆ ఇద్దరు మహిళా మంత్రులకు కేబినెట్ మంత్రుల హోదాలో మహిళా దినోత్సవ వేడుకలని జరుపుకోవడం ఇదే చివరిది అవుతుందని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విషయాలపై బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి అన్ని అర్హతలూ ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక ఇప్పుడు ఇద్దరు మహిళా మంత్రులను టార్గెట్ చేసేలా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. మరి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అవుతాయో వేచి చూడాలి.