- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సింగ్ సూపరింటెండెంట్ మృతి.. కారణం ఆమేనా..?
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు మృతి చెందింది. ఇటీవల కొవిడ్ బారినపడిన ఆమె పూర్తిగా కోలుకోక ముందే విధులలో చేరడంతో పరిస్థితి విషమించి చనిపోయింది. బాగ్‌లింగంపల్లిలో నివాసం ఉండే సిస్టర్ బ్లాండినా (57) సుమారు 25 సంవత్సరాలుగా పలు ప్రభుత్వ ఆస్పత్రులలో నర్సుగా సేవలందించింది. నాలుగు నెలల క్రితం నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆమె కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పని చేస్తోంది. గత నెలలో ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరి వైద్య సేవలు పొంది కోలుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో కోలుకోక ముందే విధులలో చేరాల్సి రావడంతో ఆమె పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు.
విధులలో ఎంతో చురుకుగా ఉండే బ్లాండినా కరోనా బారిన పడి పూర్తిగా కోలుకోకముందే వెంటనే విధులలో చేరాలని కోఠి మెటర్నిటీ అధికారులు తెచ్చిన ఒత్తిడితోనే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమెకు 45 శాతం లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఆస్పత్రి అధికారులు ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు కోఠి ఆస్పత్రితో పాటు పేట్లబుర్జు ఆస్పత్రులలో విధులు నిర్వహించాలని వేధింపులకు గురి చేయడంతో మృతి చెందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో బ్లాండినాకు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పెరిగి ఈ నెల 14వ తేదీన కోఠి ఆస్పత్రిలో విధులలో ఉన్న సమయంలోనే కింద పడిపోయిందని, అయినా ఆస్పత్రి ఉన్నతాధికారి స్పందించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమాచారం అందించడంతో కుమారుడు డేవిడ్ అక్కడికి వచ్చి బర్కత్‌పురాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వెంటిలేటర్ పై చికిత్సలు పొందుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు వివరించారు. విధులలో ఎంతో చురుకుగా ఉండే ఆమెను హాస్పిటల్ సూపరింటెండెంట్ తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేశారని, కొవిడ్ పూర్తిగా తగ్గక ముందే విధులలో చేరాలని ఒత్తిడి తేవడంతోనే మృతి చెందిందని తెలిపారు. ఈ మేరకు త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు బహిర్గతం చేస్తామని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.