- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఈఎస్ఐ మెడికల్ డీన్‌ను తప్పించాలి’
– డైరెక్టర్ జనరల్‌కు నర్సింగ్ విద్యార్థుల లేఖ
దిశ, న్యూస్ బ్యూరో: ఈఎస్ఐ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నందుకు మెడికల్ కాలేజ్ డీన్ ఎం. శ్రీనివాస్‌ను విధుల నుంచి తొలగించాలని సనత్ నగర్ ఈఎస్‌ఐసీ నర్సెస్ యూనియన్ డిమాండ్ చేసింది. హెడ్ ఆఫీస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా డీన్ వ్యవహరించిన ఉదాహరణలు పేర్కొంటూ యూనియన్ సోమవారం లేఖ రాసింది. ఆధార్ బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ రికగ్నైజ్డ్ పద్ధతిని డీన్ తన సొంత అభిప్రాయంతో చేపడుతున్నారని యూనియన్ ఆ లేఖలో పేర్కొంది. బయోమెట్రిక్ హాజరును వెంటనే నిలిపివేయాలని మార్చి 6న ఉత్తర్వులు ఇచ్చినా ఇక్కడి ఈఎస్ఐసీలో మార్చి 25 వరకూ అమలు చేశారని తెలిపారు. ప్రధాన కార్యాలయం ఆదేశాలను పాటించకుండా తన ఇష్టారీతిలో వ్యవహరిస్తున్న డీన్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని లేఖలో కోరారు.
Tags : ESIC, Director General, Nurses Union, Deen, Biometric