కరోనాకు భయపడని నర్సు

by sudharani |
కరోనాకు భయపడని నర్సు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కడ ఒకరికి కరోనా సోకిందంటనే ఆ చుట్టుపక్కల కనీసం 10 కిలో మీటర్ల మేర ఒక వ్యక్తి కనిపించడంలేదు. డాక్టర్లు సైతం కరోనా సోకిన వారికి వైద్యం చేసేందుకు వెనుకాడుతున్నారు. ఎందుకంటే అది ఎప్పుడు ఏ రూపంలో తమను చేరి మృత్యు ఒడిలోకి తీసుకెళ్తుందోననేది తెలియడంలేదు. దీంతో ప్రతి ఒక్కరూ గజగజ వణికిపోతున్నారు.

అయితే.. చైనాలోని చాంగ్ కింగ్ పబ్లిక్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో హెడ్ నర్సుగా పని చేస్తున్న ఫ్యాన్ అంజి అనే ఓ మహిళ తన విధి నిర్వాహణలో ఔదార్యం చాటుకుంది. ఏ మాత్రం భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా సోకినవారికి వైద్య సేవలందిస్తోంది. ఆమె వైద్య వ్యర్థాలను తొలగించే నిర్వహణను కూడా జాగ్రత్తగా చేస్తోంది. ఇలా జాగ్రత్తగా కరోనా బాధితులకు సేవలందిస్తోంది. ఇదంతా చూసిన చైనాకు చెందిన ఓ సంస్థ ఓ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టింది. కరోనా సోకిన వారికి మేం వైద్య సేవలనందించేటప్పుడు అది మాకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటంది కానీ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ రోగులకు సేవలందిస్తున్నానని, ఇతర కార్యక్రమాలు చేస్తున్నానని, ఎందుకంటే అది నా బాధ్యత అని నర్సు అంజి ఆ వీడియోలో పేర్కొన్నది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరూ ఆ నర్సును మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


tags : china, corona virus, nurse, good job

Advertisement

Next Story

Most Viewed