థర్డ్ వేవ్ వచ్చినా షూటింగ్ పూర్తిచేసేలా NTR30 సెట్.. ఖర్చు ఎంతో తెలుసా?

by Shyam |
థర్డ్ వేవ్ వచ్చినా షూటింగ్ పూర్తిచేసేలా NTR30 సెట్.. ఖర్చు ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. వీరిద్దరి కలయికలో మరో భారీ బడ్జెట్ సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కోసం కొరటాల ఇప్పటికే కథ సిద్ధం చేయగా.. ఎన్టీఆర్ కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేశారట. ఇక ఈ సినిమా కోసం జూబ్లీ‌హిల్స్‌లోని ఎన్టీఆర్ ఇంటికి సమీపంలోనే మేకర్స్ భారీ సెట్ వేయిస్తున్నారని సమాచారం. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సరే.. షూటింగ్‌కు అంతరాయం కలగకుండా ఉండటమే మేకర్స్ ఉద్దేశం కాగా.. మేజర్ పార్ట్స్ అన్నీ ఈ సెట్‌లోనే తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కోట్ల ఖర్చుతో డిజైన్ చేస్తున్న సెట్.. మూవీకి హైలెట్ కానుందని తెలుస్తోంది.

Advertisement

Next Story