కరోనా నివారణపై తారక్, చెర్రీ సూచనలు

by Shyam |
కరోనా నివారణపై తారక్, చెర్రీ సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ… దీనిపై అవగాహన పెంచేందుకు ప్రముఖులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు.. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కరోనా వ్యాప్తి నివారణకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరు సూత్రాలను సూచిస్తోందని.. వాటిని ఆచరిస్తే కరోనా నుంచి కాపాడుకోగలమని సూచించారు.

డబ్లూహెచ్ఓ సూచించిన ఆరు సూత్రాలను పాటిస్తే కోవిడ్ 19 నుంచి సులువుగా బయపడొచ్చని తెలిపారు తారక్, చెర్రీ. చేతులను శుభ్రంగా మోచేతి వరకు కడుక్కోవాలని.. బయటకు వెళ్లొచ్చినప్పుడు, భోజనానికి ముందు ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. కరోనా ప్రభావం తగ్గే వరకు తెలిసిన వారు ఎదురుపడితే.. కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలన్నారు. అనవసరంగా కళ్లు రుద్దుకోడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టడం లాంటివి మానేయాలని సూచించారు. పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్‌లు ధరించాలని.. అనవసరంగా మాస్క్‌లు ధరిస్తే కోవిడ్ 19 మీకు అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిని కాకుండా… మోచేతిని అడ్డుపెట్టుకోవాలని సూచనలు అందించారు. జనం ఎక్కువ ఉండే చోటుకి వెళ్లొద్దని.. మంచినీళ్లు ఎక్కువగా తాగాలన్నారు. వేడినీరు అయితే మరీ మంచిదని తెలిపారు. వాట్సప్‌లో వచ్చే ప్రతీ వార్తని చదివి నిజమని నమ్మొద్దని.. అనవసరంగా ఆ వార్తను ఫార్వార్డ్ చేయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్ 19పై ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి మనల్ని మనం కాపాడుకుందామన్నారు ఎన్టీఆర్, చరణ్.


Tags: NTR, Ram Charan Tej, Covid19, CoronaVirus, RRR

Advertisement

Next Story

Most Viewed