ఇంటి దగ్గరే తాతకు తారక్ నివాళి..

by  |
ఇంటి దగ్గరే తాతకు తారక్ నివాళి..
X

‘ఆయన జీవితం తెరిచిన పుస్తకం.. నటుడిగా తన నటన విశ్వవ్యాప్తం.. నాయకుడిగా తన సేవ అజరామరం.. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ మహనీయుడే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు’ ఆయన జయంతి( మే 28)ని పురస్కరించుకుని ప్రతీ ఏట హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఇంటి దగ్గరే తాత గారికి అంజలి ఘటించాలని నిర్ణయించుకున్నారట జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని నిర్మాత మహేష్ కోనేరు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

ప్రభుత్వ లాక్‌డౌన్ నిబంధనలను అనుసరిస్తూ.. ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది గుమికూడదని.. కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనే ఇందుకు కారణమని తెలిపారు. వారి ఇంటి దగ్గరే తాతను స్మరించుకుని నివాళులు అర్పిస్తారని తెలిపారు. అభిమానులు కూడా వారి వారి ఇళ్లలో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి.. కరోనా నుంచి కాపాడుకోవాలని తెలిపారు.


Next Story

Most Viewed