ఎన్టీఆర్ భవన్‌పై దాడి కేసులో పురోగతి..10 మంది అరెస్ట్

by srinivas |   ( Updated:2021-10-23 03:16:52.0  )
10-Members-11
X

దిశ, ఏపీ బ్యూరో: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌పై వైసీపీ నేతల దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా దాడులకు పాల్పడిన 10 మంది నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 1) పానుగంటి చైతన్య 2) పల్లపు మహేష్ బాబు 3) పేరూరి అజయ్ 4) శేషగిరి పవన్ కుమార్ 5) అడపాల గణపతి 6) షేక్ అబ్దుల్లా 7) కోమటిపల్లి దుర్గారావు 8) జోగ రమణ 9) గోక దుర్గాప్రసాద్ 10) లంక అభి నాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిగిలిన వారిని కూడా పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ఇవ్వాలని టీడీపీ ఆఫీస్‌కు 91సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినట్లు పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు టీడీపీ ఆఫీస్ నుంచి సీసీ ఫుటేజ్ రాలేదని వెల్లడించింది. సీసీ ఫుటేజ్ ఇస్తే దాని ఆధారంగా మిగిలిన ముద్దాయిలను గుర్తించి ఈ కేసులో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపింది. ఈ దాడిలో పాల్గొన్నవారందరినీ గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story