- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి వ్యాఖ్యలపై భగ్గుమన్న NSUI.. నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
దిశ ప్రతినిధి, వరంగల్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొంతమంది దోపిడీకి గురవుతోందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోగా మంత్రులు అవమానించేలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అనుబంధం విద్యార్థి సంఘం NSUI నేతలు మండిపడ్డారు. నిరుద్యోగులకు హామాలీ పని కల్పిస్తామంటూ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించడం అహంకారానికి నిదర్శనమని అన్నారు. శనివారం వరంగల్ డీసీసీ భవన్ ఎదుట NSUI వరంగల్ జిల్లా అధ్యక్షుడు పల్లకొండ సతీష్ ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ నిరసనలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇకపై ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు నిర్వీరామంగా కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, వరంగల్ జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహళ్ తదితరులు పాల్గొన్నారు.