ఎన్‌పీఆర్ బాద్ మే ‘కరోనా’

by Shamantha N |   ( Updated:2020-03-25 07:08:46.0  )
ఎన్‌పీఆర్ బాద్ మే ‘కరోనా’
X

– కేంద్ర హోం శాఖ ఆదేశాలు

దిశ, న్యూస్ బ్యూరో: సెన్సస్ – 2021 ఫేజ్ 1తో పాటు దేశవ్యాప్తంగా వచ్చే నెల స్టార్ట్ కావాల్సిన వివాదాస్పద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్) ప్రక్రియపై కరోనా ఎఫెక్ట్ పడింది. దేశమంతా కరోనా వ్యాప్తి నిరోధం కోసం లాక్‌డౌన్ అమలవుతుండడం, ఈ వైరస్ ఎప్పటికి తగ్గు ముఖం పడుతుందో తెలియకపోవడంతో ఎన్‌పీఆర్ నమోదు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆఫీసు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. జన గణన(సెన్సస్)-2021 రెండు విడతలుగా జరగాల్సి ఉందని హోం శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మొదటి విడత కింద హౌజ్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రక్రియ జరగాల్సి ఉందని, రెండవ విడతగా 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 నుంచి వరకు జనాభా లెక్కింపు జరగాల్సి ఉందని పేర్కొంది. వీటిలో మొదటి విడత సెన్సస్ తో పాటే ఎన్‌పీఆర్ నమోదు జరగాల్సి ఉందని వెల్లడించింది. అంటే ఈ ఏప్రిల్ నుంచి సెన్సస్ ఫేజ్ 1తో పాటు ప్రారంభం కావాల్సిన ఎన్‌పీఆర్‌ను సైతం నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా సెన్సస్, ఎన్ పీఆర్ నమోదు ప్రక్రియలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నిరోధానికి లాక్‌డౌన్ ప్రకటించడం వల్లే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ పేర్కొంది.

tags: npr, census 2021,corona, home department

Advertisement

Next Story

Most Viewed