- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకనుండి కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా గాంధీలో సేవలు..
దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో వేగంగా విజృంభిస్తుంది. కరోనా కేసులు అధికమవుతుండడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని మరోసారి కరోనా ఆసుపత్రిగా మార్చిన విషయం తెలిసిందే. కరోనా సోకి అత్యవసర చికిత్స అవసరమున్న వారికి ఇక్కడ చికిత్స నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అయితే వైద్యులు ఇప్పటివరకు కరోనా సోకినట్లు ధృవీకరణ పత్రం ఉంటేనే రోగిని గాంధీ ఆసుపత్రిలో చేర్చుకునే వారు. కానీ ఇక నుండి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ లేకున్నా కూడా చేర్చుకుంటామని గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
అయితే ఇటీవల ఓ మహిళా అంబులెన్స్ లో అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు కరోనా సోకినప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడంతో, గాంధీ ఆసుపత్రి సిబ్బంది కరోనా సోకిన సదరు మహిళను ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీంతో ఆమె రెండు గంటల పాటు అంబులెన్సులోనే నరకయాతన అనుభవించి మరణించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే కరోనా నిర్దారణ పత్రం లేకున్నా గాంధీలో చేర్చుకుంటామని, విషమ పరిస్థితిలో వచ్చిన అంబులెన్సులను అడ్డుకోవద్దని సెక్యూరిటీ సిబ్బందికి కూడా రాజారావు ఆదేశాలు జారీ చేశారు.