లైన్ జడ్జిపై జకోవిచ్ దాడి

by Shyam |
లైన్ జడ్జిపై జకోవిచ్ దాడి
X

దిశ, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్‌ (US Open)లో ఆదివారం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు, యూఎస్ ఓపెన్ ఫేవరెట్లలో ఒకడైన నోవాక్ జకోవిచ్ మహిళా లైన్ జడ్జిపై దాడి చేయడంతో ఒక్కసారిగా టెన్నిస్ లోకం ఉలిక్కిపడింది. క్వార్టర్ ఫైనల్స్ (Quarterfinals) మ్యాచ్‌లో లైన్ జడ్జి గొంతుపై టెన్నిస్ బంతితో కొట్టాడు. దీంతో అతడిపై నిర్వాహకులు అనర్హత వేటు వేయడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

ఆదివారం స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెనో బస్టాతో క్వార్టర్ ఫైనల్స్‌లో జకోవిచ్ తలపడ్డాడు. తొలి సెట్‌లో జకోవిచ్ 5-6తో వెనుకబడిన సమయంలో సర్వీస్ చేజార్చుకున్నాడు. ఆ సమయంలో అసహనంతో బంతిని తీసుకొని వెనక్కు తిరిగి బలంగా కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న లైన్ జడ్జ్‌కు బలంగా తాకింది. వెంటనే తన తప్పును తెలుసుకొని ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాడు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జకోవిచ్ వాదించాడు.

కానీ నిబంధనల ప్రకారం నిర్వాహకులు అతడిని డిస్ క్వాలిఫై (Disqualify) చేశారు. కాగా తాను చేసిన పనిపై జకోవిచ్ విచారణ వ్యక్తం చేశాడు. ‘నేను చేసింది తప్పే. కానీ టోర్నీ నుంచి తనను బయటకు పంపడం బాధగా ఉంది. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నాను. లైన్ జడ్జీకి ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు చెబుతున్నాను. ఆమె వ్యక్తిగత సమాచారం వెల్లడించకూడదు కాబట్టి పేరు చెప్పడం లేదు. ఇది నాకు ఒక గుణపాఠం లాంటిది. యూఎస్ ఓపెన్ నిర్వాహకులకు కూడా తాను క్షమాపణలు చెబుతున్నాను’ అని జకోవిచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.

Advertisement

Next Story

Most Viewed