మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన.. జగన్‌దే తుది నిర్ణయం

by srinivas |
మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన.. జగన్‌దే తుది నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటారని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్‌కు అందజేసినట్లు తెలిపారు. నివేదికను సీఎం జగన్ అధ్యయనం చేసి మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పీఆర్‌సీ నివేదికను సీఎం వైఎస్‌ జగన్‌కు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులతో అందజేశారు. అనంతరం సీఎస్ సమీర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఫిట్ మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేశామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇస్తున్న ఫిట్ మెంట్, పీఆర్సీ, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదిక రూపొందించినట్లు తెలిపారు. పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉందని సీఎస్ డా.సమీర్ శర్మ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed