- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్కౌట్ కానీ సెంటిమెంట్.. అక్కడ కేసీఆర్‌కు బిగ్ షాక్
దిశ, హుజురాబాద్: శాలపల్లి-ఇందిరానగర్ సెంటిమెంట్ కేసీఆర్‌కు వర్కౌట్ కాలేదు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మైదానంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి 2014 సాధారణ ఎన్నికల ప్రచార సభలో రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించి సెంటిమెంట్‌గా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల పోటీచేసి ఘన విజయం సాధించారు. అయితే ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రంగంలో దిగారు.
ఎలాగైనా ఈటలను ఓడించాలని హుజురాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత ఓట్లను ప్రభావితం చేసేందుకు దళితబంధు పథకాన్ని సెంటిమెంట్ పేరిట ఆదే శాలపల్లి-ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆ గ్రామ ఓటర్లు కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటలకు 659 ఓట్లు పోల్ కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 452 ఓట్లు వచ్చాయి. సీఎం ప్రతిష్టాత్మకంగా సెంటిమెంట్ పేరిట దళితబంధు ప్రవేశపెట్టిన శాలపల్లి-ఇందిరానగర్‌లో కూడా బీజేపీ అభ్యర్థి 207 ఓట్లు ఆధిక్యత సాధించడం విశేషం.