రికార్డు సృష్టించిన పట్టభద్రులు.. ఐదో స్థానంలో చెల్లని ఓట్లు!

by Shyam |   ( Updated:2021-03-19 12:47:01.0  )
graduate votes
X

దిశ, తెలంగాణ బ్యూరో : చదువొస్తే ఉన్న మతి పోయిందని ఓ సామెత. సరిగ్గా ఈ మాటలను నిజం చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓటర్లు ఓ ఘట్టాన్ని ఆవిష్కరించారు. పట్టభద్రులు వేసిన చెల్లుబాటు కానీ ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మెజారిటీ అభ్యర్థులను వెనక్కి నెట్టి ప్రధాన పోటీదారుల సరసన నిలబడుతున్నాయి. హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. చెల్లని ఓట్లన్నీ ఒక అభ్యర్థిగా అనుకుంటే 89 మందిని వెనక్కి నెట్టి ఐదో స్థానంలో నిలుస్తున్నాయి. ఈ స్థానంలో 3,58,348 ఓట్లు పోలవ్వగా.. 3,37,039 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటు కాని ఓట్ల సంఖ్య 21,309. టీఆర్ఎస్​, బీజేపీ, ప్రొఫెసర్​నాగేశ్వర్, కాంగ్రెస్​ పార్టీల అభ్యర్థుల తర్వాత స్థానంలో నిలిచిన 89మంది అభ్యర్థులను వెనక్కి నెట్టి ‘చెల్లుబాటు కాని ఓట్లు’ నిలిచాయి.

ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా.. ప్రతి రౌండ్​లోనూ 3వేలకు తగ్గకుండా చెల్లని ఓట్లు ఐదో స్థానంలో నిలుస్తూ వచ్చాయి. ఆ తర్వాత 5 నుంచి10 వేల మధ్య ఓట్లు సాధించిన వారు ఇద్దరు, 1000 నుంచి 3వేల వరకు సాధించిన వారు ఇద్దరు.. 501 నుంచి వెయ్యి వరకు సాధించిన వారు ముగ్గురు, 201 నుంచి 500 ఓట్లు సాధించిన వారు 11 మంది, 100 నుంచి 200 ఓట్లు సాధించినవారు 18 మంది, వందలోపు ఓట్లు సాధించిన వారు 18 మంది ఉండగా.. సింగిల్​డిజిట్ ఓట్లతో ఒక్కరు మాత్రమే ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed