- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కానరాని దేశాలివే!
దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది. ఇక్కడ దాదాపు అన్నామంటే కొన్ని దేశాలకు కరోనా సోకలేదని అర్థం. అయితే ఆ జాబితాలో ఏప్రిల్ 20 నాటికి 33 దేశాలు ఉన్నాయి. దాదాపు 30 లక్షల మందికి సోకిన ఈ వైరస్ ఈ 33 దేశాల్లో మాత్రం తన ప్రతాపాన్ని చూపించలేకపోయింది. వీటిలో చాలా వరకు చిన్న చిన్న దేశాలే ఉన్నాయి. కొమోరస్, లెసేతో, తజికిస్తాన్, తుర్కెమెనిస్తాన్, నౌరూ, కిరిబతి, సోలోమన్ ద్వీపాలు ఉన్నాయి.
ఏప్రిల్ 20 నాటికి ఐక్యరాజ్యసమితి గుర్తించిన 247 దేశాల్లో 214 దేశాలకు కొవిడ్ 19 సోకింది. వీటిలో 190 దేశాల్లో స్థానిక వ్యాప్తి ప్రబలింది. అంటే కమ్యూనిటీలో దేశం లోపలి భాగాల్లో వైరస్ వ్యాప్తి బాగా పెరిగింది. వీటిలో 166 దేశాల్లో మాత్రమే కొవిడ్ 19 మరణం నమోదయ్యింది. అయితే ఒక దేశంలో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారిక లెక్కలు చెప్పినంత మాత్రాన నమ్మలేం. ఎందుకంటే ఉదాహరణకు ఉత్తర కొరియానే తీసుకుంటే… దీని చుట్టూ ఉన్న చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ వ్యాప్తి బాగా ఉంది. కానీ తమ దేశంలో లేదని ఉత్తర కొరియా చెప్పడం నమ్మశక్యంగా లేదు.
ఇక ఖండాల వారీగా కరోనా ట్రెండ్స్ చూస్తే… ఆసియాలో రెండు దఫాలుగా వైరస్ వ్యాప్తి జరిగింది. ఇక యూరప్‌లో ఫిబ్రవరి చివరి వారానికి గానీ వైరస్ బయటపడలేదు. అలాగే జనవరి చివరి వారానికి లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో ప్రవేశించినప్పటికీ వేగంగా వ్యాప్తి చెందింది. అంతేకాకుండా వైరస్ బారిన పడి కోలుకున్న దేశాల్లో అంగీల్లా, గ్రీన్‌లాండ్, కరీబియన్ ఐలాండ్స్ ఆఫ్ సెయింట్ బార్ట్స్, సెయింట్ లూసియా, యెమెన్ ఉన్నాయి.
Tags: Coronavirus, covid 19, non corona, countries, virus free