తీవ్ర అనారోగ్యంతో కిమ్ జోంగ్‌..?

by Shyam |
తీవ్ర అనారోగ్యంతో కిమ్ జోంగ్‌..?
X

ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగా లేదా..? ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయ్యారా..? కొరియా ప్రభుత్వం ఈ విషయాలను బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఉత్తర కొరియాలో అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేది కిమ్ ఇల్ సంగ్ జయంతి వేడుకలు. ఉత్తర కొరియా తొలి అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 1948లో బాధ్యతలు చేపట్టి అతను మరణించే వరకు.. అనగా 1994 వరకు పాలించాడు. దీంతో ఆయన జయంతి ఉత్సవాలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజును ‘డే ఆఫ్ ది సన్’గా వ్యవహరించడమే కాక జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరు కాలేదు. తన తాత జయంతి వేడుకల్లో ఎక్కడా కనిపించడమే కాకుండా.. కుమ్సుసన్ ప్యాలెస్‌ ఆఫ్ సన్‌లో జరిగిన వేడుకల్లో కొంత మంది సీనియర్ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. కనీసం దేశ ప్రజలను ఉద్దేశించి కూడా గత కొంత కాలంగా కిమ్ ప్రసంగాలు చేయడం లేదు. కరోనాకు సంబంధించిన వార్తలు కూడా ఆ దేశం నుంచి అసలు రావడం లేదు. వీటన్నింటిపై ఉత్తర కొరియా గోప్యత పాటిస్తోంది.

కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్, తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఇద్దరూ దేశాధ్యక్షులుగా పని చేశారు. వీరిద్దరూ చైన్ స్మోకర్లు మాత్రమే కాక ఉబకాయులు. వీరిద్దరూ గుండె పోటుతోనే మరణించారు. వీరి వారసుడైన కిమ్ జోంగ్ ఉన్ కూడా ఊబకాయుడే కాకుండా చైన్ స్మోకర్ కూడా. ఇంతకు మునుపు కూడా శ్వాస సంబంధ వ్యాదులకు కిమ్ చికిత్స తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో అతనికి కనుక కరోనా వస్తే అది మరింత అపాయమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గత కొంత కాలంగా గొంతు సంబంధిత వ్యాదితో బాధపడుతున్నాడు. అందుకే అసలు బయటికే రాకుండా పూర్తి సమయం ఇంటిలోనే గడుపుతున్నాడని.. బయటకు వస్తే తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుసుకొనే కిమ్ ఇలా అజ్ఞాతంలో ఉండిపోయాడని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.

TAGS: north korea, kim jong un, supreme leader, ill, unhealthy

Advertisement

Next Story

Most Viewed