కిమ్ జాంగ్ మాట పట్టించుకోని ఉత్తర కొరియా పార్లమెంట్

by vinod kumar |
కిమ్ జాంగ్ మాట పట్టించుకోని ఉత్తర కొరియా పార్లమెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఆ దేశ పార్లమెంటును రబ్బర్ స్టాంప్ పార్లమెంట్‌గా మీడియా పరిగణిస్తుంటుంది. ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అయితే ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియాలో గట్టి నిబంధనలే పెట్టాడు కిమ్. ఇందులో భాగంగా సామాజిక దూరం పాటించాలని లేకపోతే కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పాడు.

అయితే ఈ నిబంధనను ఆదివారం జరిగిన పార్లమెంట్ మీటింగులో చట్టసభ్యులు బేఖాతరు చేశారు. పక్కపక్కనే వేసిన కుర్చీల్లో కూర్చొని కరోనా గురించి కార్యాచరణను చర్చించారు. ఇంకా ఈ మీటింగులో ఏ ఒక్కరూ కూడా మాస్కులు ధరించకపోవడం గమనార్హం. మరి చట్టాలు చేసే వాళ్లే ఇలా చేస్తే కఠిన నిబంధనలు ఉన్న ఉత్తర కొరియా ప్రజల సంగతేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఉత్తర కొరియాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

Tags – North Korea, Kim Jong, Parliament, Corona, WHO, Government

Advertisement

Next Story

Most Viewed