- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలు రికార్డు.. 12గంటల్లో 17పాటలు..!
దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలు పాటల రికార్డులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. నాన్‌స్టాప్ పాటలు పడటమే కాకుండా, కేవలం 12గంటల్లో 17 పాటలు పాడిన రికార్డు ఆయనకు మాత్రమే సొంతం. తమిళం చిత్రం 'కేలడి కణ్మణి'లో నాన్-స్టాప్ పాట పాడిన బాలు రికార్డు సృష్టించారు. మొత్తం పదకొండు భాషల్లో పాటలు పాడినా తుళు, కొంకణి, బడగ భాషల్లోనూ కొన్ని పాటలు పాడారు. అప్పటికే దక్షిణాది భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న బాలు కన్నడంలోనూ ప్రత్యేక రికార్డు సృష్టించారు. 1981 ఫిబ్రవరి 8న సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్ సమక్షంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల సమయంలో ఏకంగా 17 పాటలు పాడి సంచలనం నెలకొల్పారు.
మరో సందర్భంలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఒకే రోజులో 19 పాటలు పాడి సినీ పరిశ్రమలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. అదే తరహాలో హిందీలో సంగీత దర్శకులు ఆనంద్, మిళింద్ సమక్షంలో ఒకేరోజున 16 పాటలు పాడి ఆ భాషలోనూ బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేలకు పైగా పాటలు, పలు భక్తి గీతాల ఆడియో అల్బమ్‌లు సృష్టించి ప్రపంచ రికార్డు సాధించారు