తగ్గిన నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ఆదాయం

by Harish |
తగ్గిన నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో దేశీయ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయంలో 5.55 శాతం క్షీణించి రూ. 22,774.60 కోట్లుగా నమోదైనట్టు ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ గణాంకాల ప్రకారం.. 34 నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో రూ. 24,111.78 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించాయి.

ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రీమియం 6.08 శాతం క్షీణించి రూ. 10,959.88 కోట్లుగా నమోదవగా, గతేడాది ఇది రూ. 11,669.43 కోట్లుగా నమోదైందని బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) పేర్కొంది. అలాగే, ప్రైవేట్ రంగంలోని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల సెప్టెంబర్ నెల ప్రీమియం ఆదాయం 5.04 శాతం క్షీణించి రూ. 11,814.71 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇది రూ. 12,442.35 కోట్లుగా ఉంది. అదేవిధంగా, అన్ని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో 7 స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థల ప్రీమియం ఆదాయం 38.04 శాతం పెరిగి రూ. 1,543.62 కోట్లు నమోదవగా, గతేడాది ఇది రూ. 1,118.24 కోట్లుగా నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed