- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆకట్టుకుంటున్న ‘హస్లర్’ రాప్ సాంగ్
పొద్దున లేవగానే అమ్మాయిల మీద హత్యాచారం జరిగిందని పేపర్‌లో చూడటం.. సోషల్ మీడియాలో అమ్మాయిల పోస్ట్‌లపై అశ్లీలంగా కామెంట్ చేయడం.. ఐదు నిమిషాల సుఖం కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం.. ఇది ఇంక కొనసాగదు.. ‘హస్లర్’ పుట్టింది ఇలాంటి వేషాలు ఇక సాగవ్.. ప్రతీ అమ్మాయి ఒక రెబల్.. ఆమెతో ఆటలు ఆడొద్దంటూ సింగర్ నోయల్ సన్ చేసిన ‘హస్లర్(Hustler)’ వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. యుట్యూబ్(youtube)లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఉమెన్ పవర్ గురించి చెప్తూ కంపోజ్ చేసిన రాప్ సాంగ్.. ఇంటెన్స్ లిరిక్స్‌తో రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. తప్పు చేసినప్పుడు వాడి చెయ్యి వణకనప్పుడు.. ఆ తప్పును వేలెత్తి చూపేందుకు నీ చేయి ఎందుకు వణుకుతుంది? అంటూ స్టార్ట్ అయిన సాంగ్.. ఆడది తిరగబడితే ఎలా ఉంటుందో చూపించింది. ‘మనిషి లాగ పుట్టినోడు మనిషిలాగ బతకాలి.. గెలకమాకు మృగంలా గెలుపు నీ సొత్తులా.. ఒకరి జీవితంలో వేలు పెడితే పుచ్చె పగిలిపోతుంది’ అంటూ హెచ్చరించాడు. ఆడపిల్ల కంట్లో నీరు వస్తే సచ్చిపోతవురా అరేయ్.. అంటూ పాట ద్వారా హితవు పలికాడు నోయల్. మీడియా ఆడపిల్లల్ని విక్టిమ్( బాధితులు)గా చూపించకుండా సర్వైవర్స్‌గా గుర్తించాలని సూచించారు.