- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇగో ఫోన్ నెంబర్లు.. మీరు ఐఏఎస్ లతో మాట్లాడొచ్చు!
దిశ, న్యూస్ బ్యూరో: గ్రేటర్‌లో కరోనా విస్తృతికి అడ్డుకట్ట వేసేందుకు బల్దియా చర్యలు చేపడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్న సర్కిళ్లకు స్పెషల్ అధికారులను కమిషనర్ లోకేశ్ కుమార్ నియమించారు. ఆయా ప్రాంతాల్లో కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలను ప్రత్యేక అధికారులు తీసుకోనున్నారు. ఆయా జోన్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలను క్షేత్రస్థాయిలో సదరు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు బల్దియా అనేక ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కంటైన్మెంట్లు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ తర్వాత హౌజ్ క్లస్టర్లుగా మార్చింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చినవారిని హోం క్వారంటైన్లో ఉంచుతూ అక్కడ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేసులు ఎక్కువగా వచ్చిన జోన్ల పరిధిలోని సర్కిళ్లకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు. కేసుల పెరుగుదలను నిలువరించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి ఈ అధికారులు కట్టడి చర్యలు తీసుకుంటారు. ఆయా సర్కిళ్ల వారీగా అవసరమైన చర్యలపై అధికారులు దృష్టి సారించనున్నారు. పాజిటివ్ వ్యక్తులతో పాటు సర్కిళ్లలో ఇతర సేవలు అవసరమైన ప్రజలు కూడా సదరు నోడల్ అధికారుల ద్వారా తగిన సహాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని, ఐఏఎస్ అధికారులను నేరుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసే ప్రయోగాన్ని చేపడుతున్నట్టు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి వివరించారు.
జోన్ సర్కిళ్ల వారీగా నోడల్ అధికారుల వివరాలు
ఖైరతాబాద్ మెహదీపట్నం – శకంరయ్య 9866514545
ఖైరతాబాద్ కార్వాన్ – సంధ్య 9154114997
చార్మినార్ చాంద్రాయణగుట్ట – విజయలక్ష్మి 9849165982
చార్మినార్ – రాహుల్ రాజ్ 9154156689
చార్మినార్ రాజేంద్రనగర్ – బడావత్ సంతోష్ 9963614041
కూకట్ పల్లి కుత్బుల్లాపూర్ – ప్రియాంక అల 9154156671
సికింద్రాబాద్ అంబర్ పేట – జయరాజ్ కెన్నడీ 9849911735
శేరిలింగంపల్లి యూసఫ్‌గూడ – ఎన్.యాదగిరి 9704405335