రైతు భరోసా కేంద్రాలతో ఉపయోగం లేదు: ధూళిపాళ్ల నరేంద్ర

by srinivas |   ( Updated:2021-12-28 03:29:22.0  )
రైతు భరోసా కేంద్రాలతో ఉపయోగం లేదు: ధూళిపాళ్ల నరేంద్ర
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాలు రైతులను మోసం చేయటానికే ఉన్నాయని విమర్శించారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి ఆ తర్వాత అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. గుంటూరు రైతు భరోసా కేంద్రం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామని భారీ ప్రకటనలు ఇచ్చింది. కానీ ఇంతవరకు ఒక్కగింజ ధాన్యాన్ని కూడా కొనలేదు. ప్రభుత్వం ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకటించి ఇంతవరకు ఒక బస్తా ధాన్యాన్ని కూడా అధికారుల చేత కొనిపించలేక పోయింది.

ముఖ్యమంత్రి జగన్ రైతులకు చెప్పేమాటలు వేరు.. ఆయన చేసే పనులు వేరు. అందుకే రెండింటికి పొంతన లేకుండా పోయింది. నేడు రైతులు వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా నేడు వచ్చే పరిస్థితి లేదు. రైతు పండించిన ధాన్యం దగ్గరకు వచ్చేటప్పటికి ధర ఒక్కసారిగా దిగజారిపోతోంది’ అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలతో ఎరువులను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికవర్షాలు, చీడపిడలతో పంట నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రం ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed