- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలోచన గొప్పదే.. ఆచరణలో శూన్యం.. ఉత్సవ విగ్రహాలుగా రైతు వేదికలు
దిశ,తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు వేదికలు ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.572 కోట్లతో 2,601 రైతు వేదికలు నిర్మాణాలు చేపడుతుండగా వీటిలో 80శాతం వరకు రైతు వేదికలు పూర్తయయ్యాయి. మిగతా 20శాతం రైతువేదికలు వివిధ దశల్లో నిర్మాణాలు చేపడుతుండగా నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలు 50శాతం వరకు ప్రారంభానికి నోచుకోలేదు. మౌళిక వసతులు కల్పించకపోవడంతో అధికారులు ఎలాంటి సమావేశాలను నిర్వహించడం లేదు.
రైతులను సంఘటితం చేసేందుకు, శిక్షణా తరుగతులను అందిచేందుకు, వ్యవసాయ మెలకువలు తెలియజేసేందుకు గ్రామాల్లో ఒక వేదిక అవపరమని ప్రభుత్వం నిర్ణయించి రైతువేదికలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతువేదికలు నిర్మాణాల వరకు మాత్రమే పరిమితయ్యాయి. పూర్తిచేసిన రైతువేదికలను ప్రారంభించకపోవడం, కొన్ని గ్రామాల్లో అసంపూర్తిగా రైతువేదికలను నిర్మించడం, సామవేశాలు నిర్వహించేందుకు కనీస సదుపాయాలు లేకపోవడంతో రైతవేదికలు నిరుపయోగంగా మారిపోయాయి. దీంతో గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలు చేపట్టినప్పట్టి రైతులు సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలంటే పంచాయితీ కార్యాలయాల్లో, రచ్చకట్టల దగ్గర, చెట్ల కింద నిర్వహించుకునే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో 2,601రైతు వేదికలు :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభత్వం 2,601 రైతువేదికల నిర్మాణాలు చేపట్టేందుకు నిధులను విడుదల చేసింది. ఒక్కో రైతువేదికకు రూ.22లక్షల చొప్పున మొత్తం రూ.572కోట్లను ఖర్చుచేసింది. 5వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలా రైతువేదికల ఏర్పాట్లను చేపట్టారు. సమావేశాలు నిర్వహించేందుకు విశాలమైన హాలు, వ్యవసాయాధికారులకు, రైతుసమన్వ సమితి సభ్యులకు ప్రత్యేక గదులు, ధాన్యాన్ని నిలువ చేసేందుకు, వ్యవసాయ పనిముట్లను భద్రపరిచేందుకు గోదాంలను రైతువేదికల్లో ఏర్పాటు చేశారు.
నిరుపయోగంగా రైతువేదికలు :
ప్రభుత్వం కోట్ల రూపాయాలను వెచ్చి నిర్మాణాలు చేపట్టిన రైతువేదికలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయాయి. 80శాతం వరకు రైతువేదికలను పూర్తిచేసినా వీటిలో సగానికిపైగా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభించిన రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించుకునేందుకు కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. వ్యవసాయాధికారులు నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడం, రైతు సమన్వసమితి సభ్యులు పట్టించుకోకపోవడంతో రైతు వేదికలు నిరుపయోగంగా మిగిలిపోయాయి.
ఉమ్మడి వరంగల్ లో పూర్తికాని 210 రైతువేదికలు:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 334 రైతుల వేదికలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సర్పంచ్ లకు బిల్లులు మంజూరు కాకపోవడంతో 210 రైతు వేదికలు నిర్మాణాలు పూర్తి కాలేదు. పూర్తయిన 120 వేదికల్లో ఇప్పటివరకు ఎలాంటి అవగాహణ కార్యక్రమాలు చేపట్టడం లేదు. అధికారులను రైతు వేదికల వినియోగంపై ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని సమాధానమిస్తున్నారు.
కరీంనగర్‌లో వినియోగంలోకి రాని రైతువేదికలు :
రైతు వేదికల నిర్మాణాలు స్వయంగా సర్పంచుల పర్యవేక్షణలోనే పనులు జరగాలంటూ, గడువు కూడా నిర్దేశించి సకాలంలో పనులు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించి, సర్పంచ్ ల మెడపై కత్తి రైతువేదికలను పూర్తి చేయించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 72రైతువేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వాటిని తిరిగి తెరిచింది లేదు..రైతులకు శిక్షణ ఇచ్చింది లేదు. అధికారులు వినియోగానికి మాత్రమే అవసరమయ్యే ఫర్నిచర్ పంపి చేతులు దులుపుకున్నారు. అవసరమైన శిక్షణా సామాగ్రి కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలను కానీ ఎక్కడ నియమించలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 191 రైతు వేదికలు
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 191 రైతు వేదికలు నిర్మించారు. వీటిలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 124, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 వేదికలు ఏర్పాటు చేశారు. ఒక్కో వేదికను రూ. 22లక్షలతో 191 కేంద్రాలకు గాను సుమారు రూ. 42 కోట్లు కేటాయించారు. రైతు వేదికల్లో ఎలాంటి సమావేశాలు కార్యక్రామలు ఇప్పటి వరకు నిర్వహించలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ అందుబాటులో లేని శాస్త్రవేత్తలు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 305 రైతు వేదికలను పూర్తి చేశారు. ఆదిలాబాద్ లో 101, నిర్మల్ లో 79, మంచిర్యాలలో 55, ఆసిఫాబాద్ లో 70 రైతువేదికల నిర్మాణాలు చేపట్టారు. రైతువేదికలు ఊరికి దూరంగా ఉండటం, శాస్త్రవేత్తలు కార్యాక్రమాలు చేపట్టకపోండం, సామావేశాలకు కావల్సిన సదుపాయాలు లేకపోవటంతో నిరుపయోగంగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఏఈవోలు రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రం ఉపయోగపడుతున్నాయి. ఒక్కో కేంద్రానికి 120 కుర్చీలు, టేబుళ్లు, బీరువా, మైకు, జాలీ కుర్చీల అవసరముండగా ఏవి కూడా ఏర్పాటు చేయలేదు.
జిల్లాల వారీగా రైతు వేదికల వివరాలు
ఉమ్మడి రంగారెడ్డిలో ప్రారంభానికి నోచుకోని రైతు వేదికలు:
ఉమ్మడి రంగారెడ్డిలో రంగారెడ్డిలో 97, వికారాబాద్లో 83 మొత్తం 180 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిలో రంగారెడ్డిలో 12… వికారాబాద్ జిల్లాలో 15 భవనాలు మాత్రమే ప్రారంభించారు. ఇంకా మిగిలిన 153 రైతువేదిక భవనాలు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రారంభాని నోచుకోలేదు. ప్రారంభించిన రైతువేదికల్లో కూడా ఎలాంటి సమావేశాలు నిర్వహణ చేపట్టలేదు.
ఉమ్మడి నిజామాబాద్ లో పూర్తికాని రైతువేదికలు:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు వేదికలు 210 రైతువేదికలు మంజూరుకాగా కామారెడ్డి జిల్లాలో 104, నిజామాబాద్ జిల్లాలో 70 మాత్రమే పూర్తయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వలన 36 రైతు వేదికలు పూర్తి కాలేదు. నిర్మాణాలు పూర్తయిన రైతువేదికల్లొ ఏఇఓ లు వచ్చి పోతున్నారు కాని అవగాహన కార్యక్రమాలు జరుగడం లేదు.
ఉమ్మడి మెదక్ లో పేరుకే రైతు సమన్వయ సమితీలు:
ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ స్థాయిలో 15మంది. మండల, జిల్లా స్థాయిలో 24 మందితో రైతు సమన్వయ సమితి కమిటీలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట, మెదక్ , సంగారెడ్డి మూడు జిల్లాలలో 68 మండల్లో 1,754 గ్రామాలున్నాయి. జిల్లాకు 24 చొప్పున 72 మంది రైతు సమన్వయ సమితి సభ్యులు, 68 మండలాల్లో 1,632 సభ్యులు, 1,754 గ్రామాల్లో 26,310 మంది సభ్యులు ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 28,014 మంది రైతు సమన్వయ సమితి సభ్యులు ఉన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన రైతు సమన్వయ సమితి సభ్యులకు ఎలంటి అధికారాలు, జీతాలు చెల్లించకపోవడంతో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. కేవలం రైతుల కోసం వ్యవసాయ అధికారులు, రాష్ట్ర మంత్రులు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతూ కేవలం ప్రోటోకాలకే పరిమితమవుతున్నారు. అసలు రైతు సమన్వయ సమితి సభ్యులుగా ఉన్నట్టా లేనట్టా అనే సందేహం వారిలో కల్గుతుండగా … రైతన్నలు రైతు సమన్వయ సమితి కమిటీ ఒకటుందనే విషయాన్నే మర్చిపోయారు.
మేడ్చల్ మల్కాజిగిరిలో 9 రైతు వేదికలు :
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రూ.1.98 కోట్ల వ్యయంతో 9 రైతు వేదికలను నిర్మించారు. జిల్లాలోని కీసర, యాద్గార్ పల్లి, ప్రతాప సింగారం, ఏదులాబాద్, రాయిలాపూర్, పూడురు, అలియా బాద్, లాల్ గడిమలక్ పేట్, మూడు చింతల పల్లిలో భవనాలను నిర్మించారు. రైతు వేదికల నిర్వహణ, విధి విధానాల పై స్పష్టత లేకపోవడంతో అవి నిరూపయోగంగా తయారయ్యాయి. ప్రతి సీజన్ లో సాగుకు ముందు రైతు వేదికల ద్వారా రైతులను సంఘటిత పరిచి వివిధ పంటల పై అవగాహన, అవసరమైన సలహాలన అధికారులు ఇవ్వడం లేదు.
ఉమ్మడి మహబూబ్ నగర్ 478 రైతువేదికలు :
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 478 రైతు వేదికల నిర్మాణాలను చేపట్టారు. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలో88 ,నాగర్ కర్నూలు జిల్లాలో 143,గద్వాల జిల్లాలో 97, నారాయణపేట జిల్లాలో 77,వనపర్తి జిల్లాలో 73 రైతు వేదికలు మంజూరయ్యాయి. వీటిలో 90% వేదికల నిర్మాణాలు పూర్తి అయ్యాయి’మరో 10 శాతం రైతువేదికల పనులు పెండింగ్లో ఉన్నాయి. పూర్తయిన వాటిలో 50శాతం రైతు వేదికలనే ప్రారంభించారు.