‘ఆక్సిజన్ ట్యాంకర్లకు నో టోల్’

by Shamantha N |
Oxygen Express
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఆక్సిజన్ ట్యాంకర్లకు టోల్ ఫీజును మినహాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మోసుకెళ్తున్న ట్యాంకర్లనూ అంబులెన్స్‌లాగే ఎమర్జెన్సీ వెహికిల్స్‌గా పరిగణిస్తామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్‌కు ఏర్పడ్డ డిమాండ్‌ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మినహాయింపు రెండు నెలలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed