Omicran cure : ‘ఒమిక్రాన్’ సోకిందా..? టెన్షన్ అక్కర్లే.. ఇలా చేస్తే రెండ్రోజుల్లో క్యూర్..!

by Anukaran |   ( Updated:2021-12-04 11:59:27.0  )
Omicran cure : ‘ఒమిక్రాన్’ సోకిందా..? టెన్షన్ అక్కర్లే.. ఇలా చేస్తే రెండ్రోజుల్లో క్యూర్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒమిక్రాన్ వైరస్.. ప్రస్తుతం దీని పేరు వినబడితే చాలు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇది చాలా ప్రమాదకరమైనది. ఇండియాలో వెలుగుచూసిన డెల్టా వైరస్ కంటే ఐదు రేట్లు ప్రమాదకరమైనదని అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. సౌత్ ఆఫ్రికాలో ప్రస్తుతం ఒమిక్రాన్ ఫోర్త్ వేవ్ నడుస్తోందని పలు నివేదికలు, జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో కూడా ఒమిక్రాన్ వైరస్ ఎంటరైంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలుత రెండు కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం దేశంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని దేశ ప్రజలు వణికిపోతున్నారు.

ఈ క్రమంలోనే ప్రజలందరూ సంతోష పడే విషయాన్ని బెంగళూరు వైద్యులు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు రెండు బెంగళూరులోనే వెలుగుచూడగా.. అందులో ఒకరు డాక్టర్ (46).. అతను తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ తీసుకున్నాడు. వైరస్ సోకినప్పుడు మొదట్లో బాడీ పెయిన్స్, చలి మరియు లైట్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నాక వైరస్ అతని బాడీలో వీక్ అయ్యిందని.. రెండ్రోజుల్లోనే యాక్టివ్ అయ్యాయని బాధిత వైద్యుడు తెలిపాడు. ప్రస్తుతం తాను బ్యాడ్మింటన్ ఆడేంత ఫిట్‌గా తన బాడీ ఉందని ఒమిక్రాన్ బారిన పడిన వైద్యుడు స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed