లీడర్‌కు స్వాగత కార్యక్రమం.. నో సోషల్ డిస్టెన్స్

by vinod kumar |
లీడర్‌కు స్వాగత కార్యక్రమం.. నో సోషల్ డిస్టెన్స్
X

ముంబయి: కరోనా నుంచి రికవరీ అయిన కాంగ్రెస్ సీనియర్ లీడర్‌కు స్వాగత కార్యక్రమంలో భౌతిక దూరం మాయమైంది. మహారాష్ట్రలోని ముంబయిలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రకాంత్ హండోర్‌కు శనివారం రాత్రి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దమొత్తంలో గుమిగూడి చప్పట్లు కొడుతూ వెల్‌కమ్ చెప్పారు. ఆయన కారు ముందు ప్రజలు ఊపిరాడనంతగా కిక్కిరిసిపోయారు. ఈ కార్యక్రమంలో కొందరు డ్రమ్స్ కొడుతూ సౌండ్స్ పెంచగా.. ఇంకొందరు క్రాకర్స్ కాల్చారు. ఈ చప్పట్ల మధ్య కారు నుంచి చంద్రకాంత్ బయట అడుగుపెట్టినట్టు చూపిస్తున్న వీడియో కలకలం సృష్టిస్తున్నది. సదరు నేత రికవరీ అయ్యాడు కానీ, మరెందరినో ప్రమాదంలో పడేశాడని విమర్శలు వస్తున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలోని ముంబయి ఈ మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్నది. ఈ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించకుండా స్వాగతం చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Advertisement

Next Story