- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్సైన నీడ… ఎక్కడికెళ్లిందో తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్ : మనల్ని ఎప్పుడూ వెంటాడేది నీడ ఒక్కటే. మనల్ని అనుసరించే తోడు నీడ. ఈ నీడ అనుక్షణం మన వెన్నంటే ఉంటుంది. మనం ఒంటరిగా ఉన్నప్పడు నీవు ఒంటరిగా లేవన్న భయాన్ని పొగొడుతుంది. నీడ మనిషిని వెంటాడే ప్రతిబిబం. అలానే మనం ఎప్పుడైన ఎక్కువగా పనిచేసి సేద తీరాలన్న అది చెట్టునీడలోనే . అయితే ఇలా మనకు తెలియకుండానే నీడ మనకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. కానీ ఒక వేళ నీడ కనిపించకపోతే.. నీడ కనిపించకపోవడం ఏంటీ ? అది మనం మరణించే వరకు మనతోనే ఉంటుంది కదా అనుకుంటున్నారా.. కానీ నీడ కూడ కనిపించదు.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎర్రటి ఎండ కాసిన కాసేపు నీడ జాడలేదు.
ఈ విచిత్ర సంఘటన రాజంమడ్రిలో చోటు చేసుకుంది. దీంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇలా నీడ కనిపించకుండా పోవడానికి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రదేశాల్లో ఏడాదికి రెండుసార్లు ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటాయని, ఆ సమయాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమిని చేరుతాయని అందువల్లే నీడ కనిపించలేదని శ్రీసత్యసాయి గురుకులం వైస్ ప్రిన్సిపాల్ అయిన భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతికశాఖ అనుబంధ సంస్థ వీఐపీఎన్‌ఈటీ సమన్వయకర్త గుర్రయ్య తెలిపారు. సూర్యుడు ఉత్తర, దక్షిణ దిశగా పయనిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయని వారు పేర్కొన్నారు.