- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీరికలేని డ్యూటీలతో పోలీసులకు తిప్పలు !
దిశ, న్యూస్‌బ్యూరో: పోలీసులు అంటేనే తీరిక లేని డ్యూటీలు. బందోబస్తు, 100కు కాల్ వచ్చిందంటే క్షణం ఆగకుండా పరిగెత్తాల్సిందే. ఈ మధ్యకాలంలో కొంత మార్పు తెచ్చి 8గంటల డ్యూటీ, షిప్టు పద్ధతిల్లో పని తీసుకువచ్చినా, ప్రస్తుతం కరోనా దెబ్బతో మళ్లీ పోలీసులంతా రోడ్ల మీదకు వచ్చారు. ఎప్పుడు తింటున్నారో, ఏ సమయానికి ఏ ప్రాంతానికి వెళ్తున్నారో తెలియకుండానే డ్యూటీలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జనాలను రోడ్లమీదకు రాకుండా, ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించేలా తీవ్రంగా కృషి చేస్తుండటంతో వారు పడుతున్న కష్టాన్ని చూసి అంతా చలించిపోతున్నారు.
రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో డ్యూటీ చేస్తున్న పోలీసుల కష్టాలు చెప్పుకోలేకుండా ఉన్నాయి. ఆహారం, టిఫిన్లు అందిస్తున్నా.. సిబ్బంది, వాహనాల కొరతతో ఏ సమయానికి తింటున్నారో తెలియని పరిస్థితి. స్వచ్ఛంద సంస్థలు, పలువురు స్పందించి బిస్కట్లు, అన్నం, టీ, వాటర్ ఇస్తున్నా, పని ఒత్తిడి పెరగడంతో అసలు విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. విధులు ముగిసినా మరో చెక్‌పోస్టు వద్దకు పంపిస్తుండటంతో శారీరకంగా అలిసిపోయి ఇబ్బంది పడుతున్నారు.
మానవత్వం చాటుతున్న పోలీసులు
రోడ్లపై తిరుగుతున్న వారిని బతిమాలుతున్న వినడం లేదు. లాఠీలు ఝులిపిస్తున్నా మార్పు రావడం లేదు. దీంతో కరోనా వైరస్ తీవ్రతను చెప్పడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అడ్డాకూలీలు సొంత ప్రాంతాలకు వెళ్తున్న కుటుంబాలకు నీళ్లు, ఆహారం ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వారికి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఆహారంలో నుంచే కొద్దిగా ఇతరులకు పంచుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లేవారు, వాహనాలు లేక నడిచిపోతున్నవారిని గమనించి తమ వాహనాల్లో తరలిస్తున్నారు.
Tags: police, corona, checkpost, Telangana, Hyderabad