- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సారీ.. అక్కడ నో పర్మిషన్
దిశ ప్రతినిధి, మెదక్ : రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలతో పాటు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా కార్యాలయాలకు వస్తే వైరస్ వ్యాప్తి పెరుగుతుందన్న ఉద్దేశంతో అధికారులు ఎవరినీ తమ ఆఫీస్‌లకు అత్యవసరమైతే తప్పా అనుమతించడం లేదు. ప్రజావాణిని రద్దు చేయడంతో పాటు చాలా మంది అధికారులు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ అవుతూ కళ తప్పుతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు.. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటూ సేవలను ప్రారంభించాయి. కానీ వైరస్ తీవ్రత మరింత పెరుగుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇప్పటికే రద్దు చేశారు. ముఖ్యంగా రద్దీగా ఉండే రెవెన్యూ, మండల పరిషత్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ అధికారులు అప్రమత్తమవుతున్నారు. అలాగే పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల వివరాలను నమోదు చేసుకుంటూ లోనికి అనుమతిస్తున్నారు. కార్యాలయాలకు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తే వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో అత్యవసరమైతే తప్పా అధికారులు తమ కార్యాలయాలకు ప్రజలను రానివ్వడం లేదు. ఇప్పటి వరకు మాస్కులు, శానిటేషన్ లేనిదే లోనికి రాకూడదనే నిబంధనలు అమలు చేసిన అధికారులు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఆఫీసులకు రావద్దంటుండటంతో తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. కరోనా సాకుతో అత్యవసర పనులను సైతం అధికారులు పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
సిద్దిపేటలో కార్యాలయలు బంద్..
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 5 మంది అధికారులకు కరోనా పాజిటివ్ రావటంతో కార్యాలయానికి తాళం పడింది. కలెక్టరేట్ తో పాటు డీఎంహెచ్ఓ, తహశీల్దారు కార్యాలయం ఇతర కార్యాలయాల గేట్లు ముతపడ్డాయి. చాలా వరకు అధికారులు కార్యాలయాలకు హాజరు కావడం లేదు. చాలా తక్కువ మంది అధికారులు హాజరవుతున్నా.. ప్రజలను లోనికి అనుమతించడం లేదు.
వర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం
ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటంతో అధికార వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో కార్యాలయాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లినా భయంభయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఎవరి ద్వారా కరోనా వ్యాపింస్తుందోనన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. కొందరు ఉన్నతాధికారులైతే ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయానికి వెళ్లినా భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారి అనుమతి ఉంటే తప్పా ఎవరినీ లోనికి రానివొద్దంటూ అటెండర్లకు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అధికారులంతా వర్క్ ఫ్రం హోంకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పనుల్లో తీవ్ర జాప్యం
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు త్వరగా పూర్తి కావనే భావన ప్రజల్లో ఉంది. దీనికి కరోనా పరిస్థితులు తోడుకావడంతో సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో జవాబుదారితనం పూర్తిగా కనిపించడం లేదని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పల్లెల్లో భూ తగాదాలు, గెట్ల పంచాయతీలు పెరిగిపోతు న్నాయి. కానీ అధికారుల వద్దకు వచ్చే పరిస్థితులు లేక నేరుగా సమస్యలు చెప్పుకోలేక వెనుదిరగాల్సి వస్తున్నదని పలువురు వాపోతున్నారు.