మంత్రులకు మాస్కులు ఒద్దా..?

by Anukaran |
మంత్రులకు మాస్కులు ఒద్దా..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఎవరు ఏం చెబితే మాకెంటీ..? అన్నట్లు మంత్రుల తీరు తయారయ్యింది. కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులను ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతరులకు కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు వారి మాటలను పక్కన పెట్టేశారు.

మంగళవారం నిర్మల్ జిల్లాలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు పర్యటించారు. కానీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్ లేకుండానే హరితహారం, చేపల విడుదల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా తనకు రాదన్నట్టుగా మంత్రి “తలసాని” మాస్క్ ధరించక నిర్లక్ష్యంగా వ్యవహరించడం విశేషం. ఇక మరో మంత్రి అల్లోల మాస్క్ పెట్టుకొని కార్యక్రమానికి హాజరైనా… పలు సార్లు తీసివేయడం కనిపించింది. దీంతో మంత్రుల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed