ఈ నెల వరకు అది కుదరదు

by Shamantha N |   ( Updated:2020-05-23 02:23:57.0  )
ఈ నెల వరకు అది కుదరదు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో తమ రాష్ట్రంలో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించబోమని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నది. విదేశాల నుంచి విమానాల్లో, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించగా 66 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించన విషయం తెలిసిందే.

Advertisement

Next Story