మా ఉపాధి మీద కొట్టి.. సైలెంటయ్యారు!

by  |
మా ఉపాధి మీద కొట్టి.. సైలెంటయ్యారు!
X

పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్న గుడుంబాపై సర్కారు ఉక్కుపాదం మోపింది. గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి తయారీ దారులను రిమాండ్​కు తరలించింది. తయారీ, అమ్మకాలు మానేసిన కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికంగా చేయూతనందిస్తామని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్​అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. దీంతో ఏళ్ల తరబడి ఉపాధి పరిశ్రమగా మారిన గుడుంబా తయారీని అనేక కుటుంబాలు మానుకున్నాయి. మూడేళ్లయినా ఉపాధి మార్గం చూపించలేదని, గుడుంబా తయారీనే జీవనోపాధిగా మలుచుకున్న తమకు పునరావాసం కింద ఆర్థిక సాయం అందజేయాలని పలువురు వేడుకుంటున్నారు.

దిశ, షాద్​నగర్​:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేటమండలంలోని పలు గ్రామాలతో పాటు కొండారెడ్డి పల్లిలో దాదాపుగా 20 కుటుంబాలు గుడుంబా తయారీని ఉపాధిగా చేసుకుని జీవనం కొనసాగించాయి. పెద్దమొత్తంలో ఇక్కడ నాటు సారా తయారు చేస్తుండడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఎక్సైజ్ అధికారులు తయారీ, అమ్మకం దారు లను గుర్తించి కేసులు సమోదు చేశారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సారా తయారీని మానుకోవాలని, బైండోవర్ అయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందని ఎక్సైజ్ అధికారులు ఆ సమయంలో గ్రామస్తులకు చెప్పారు. ప్రభు త్వం అందించే ఆర్థిక సాయంతో ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని వారు సూచించా రు. దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఒకరిద్దరికి మాత్రమే సాయం అందగా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.2లక్షల ఆర్థిక సాయం అందలేదని బైండోవరైన చాలా మంది చెబుతున్నారు. ఇటు ఆర్థికసాయం అందక, అటు గుడుంబా తయారీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులను కలిసినా ఎటి స్పందన లేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు.

సాయం అందలేదు..

ఎన్నో ఏళ్ల నుంచి గుడుంబా తయారు చేసు కొని కు టుంబాన్ని పోషించుకున్నాను. ఎక్సైజ్ అధికారులు మూడుసార్లు బైండోవర్ చేశారు. ప్రభుత్వం నుంచి రూ.2లక్షల సాయం అందుతుందని, దీంతో వేరే ఉపాధి మార్గం చూసుకోవాలని చెప్పడంతో మానేశాను. దాదాపు మూడేళ్లు గడిచినా సాయం అందలేదు.

-కర్నెకోట రవీందర్, కొండారెడ్డిపల్లి గ్రామం

ఉన్న ఉపాధి కోల్పోయాం..

అధికారులు మా ఊరుకు వచ్చిన సారా తయారు చే యొద్దన్నారు. తహసీల్దార్ ఎదుట మూడుసార్లు బైం డోవర్ చేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం నేటికీ రాలేదు. ఉన్న ఉపాధి పోయింది. నఎమ్మెల్యే అసెంబ్లీలో మా గురించి మాట్లాడితే ఇక మాసమస్య తీరుతుందని సంతోషించాం. కానీ నిరాశే మిగిలింది.

-కర్నెకోట రామోజీ, కొండారెడ్డి పల్లి గ్రామం

నిధులు కేటాయించలేదు..

బైండోవరైన వారికి అం దాల్సిన ఆర్థిక సాయం ప్రభు త్వ నిర్ణయానికి సంబంధించింది. 2015-16లో ప్రభు త్వం బైండోవరైన వారికి రూ. 2 లక్షల సాయం అందిం చింది. గడిచిన మూడేళ్ల నుంచి బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం ఆదేశిస్తే ప్రతిపాదనలు పంపడానికి సిద్ధంగా ఉన్నాం.

-రామకృష్ణ, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, షాద్​నగర్​


Next Story