గుడ్లు పీకుతాడంట.. ముడ్డి మీద ఉన్న చెడ్డి లాగుతాడంట : కేసీఆర్​

by Disha Web Desk 11 |
గుడ్లు పీకుతాడంట.. ముడ్డి మీద ఉన్న చెడ్డి లాగుతాడంట : కేసీఆర్​
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రాణాలు చావు నోట్లో పెట్టి తెలంగాణ సాధించి.. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన నన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుడ్లు పీకుతా.. ముడ్డి మీద ఉన్న చెడ్డి లాగుతా.. అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. ఇదేనా అతని సంస్కారం అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగుకు కేసీఆర్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతుంది.. ఇప్పటివరకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ జరిగిందా..!? లేదు.. ఒక్కటి కూడా అమలు కాలేదు .. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను నాశనం చేస్తోంది. చావు నోట్లో ప్రాణాలు పెట్టి.. తెలంగాణ సాధన కోసం నాయకత్వం వహించి, తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేస్తే ఈ కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు వాగ్దానాలు చేసి .. ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టి ఇప్పుడు మళ్లీ కట్టు కథలు చెబుతున్నారు అని విమర్శించారు.


రాష్ట్రాన్ని నాశనం చేస్తే చూస్తూ ఉండబోము అని చెప్పారు. యుద్ధం చేస్తానని.. అందుకోసం మీ అందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిలు కుట్రలు చేస్తున్నాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి అన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి వంద నినాదాలు చెప్పాడు. అవి అన్ని.. కట్టు కథలు.. పిట్ట కథలు తప్ప ఏవి అమలు కాలేదు అని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి జాతీయ హోదా కల్పించమని 100 ఉత్తరాలు రాస్తే ఏమాత్రం స్పందించలేదని చెప్పారు.

మన రూపాయి విలువ పతనం చెందింది, 18 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.. వాటిని భర్తీ చేయలేదు. నల్ల చట్టాలను వ్యతిరేకించిన 780 మంది రైతుల ఉసురు తీసిండ్రు అని కేసీఆర్ వివరించారు. చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల, మెడికల్ కళాశాలలను కేంద్రం కేటాయించాలి. కానీ మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క నవోదయ పాఠశాల గాని.. ఒక మెడికల్ కళాశాలను గాని మంజూరు చేయలేదు. అటువంటి పార్టీకి మన ఒక్క ఓటు ఎందుకు వెయ్యాలి అని ప్రశ్నించారు. జిల్లా నుండి ఆంధ్రులు నీళ్లు తీసుకెళ్తుంటే మంగళ హారతులు పట్టిన అభ్యర్థికి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది.

కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం. మైనారిటీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే బీజేపీ గెలుస్తది. దీనివల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియనిది కాదు. సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉన్న బి.ఆర్.ఎస్ మైనార్టీల సంక్షేమం కోసం గురుకులాలు, రంజాన్ కానుకలు, మసీదుల అభివృద్ధి, అందులో పని చేసే వారికి వేతనాలు చెల్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణను నాశనం చేసే వారిని అడ్డుకోవడానికి మనమందరం యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి. అందుకోసం ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో గులాబీ శ్రేణులలో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed